- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన సాహసం ఎన్నటికీ మరువలేం.. నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు
by Thanuru Gopichand |
ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పిస్తున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పిస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా వెలుగొంది ‘ఆంధ్రకేసరి’ గా కీర్తిప్రతిష్టలు పొందిన ఆ మహనీయుడు మనందరికి స్ఫూర్తి ప్రదాత అని ఆయన పేర్కొన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని బ్రిటీష్ తుపాకికి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేం.అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగనిరతి ఆదర్శవంతం. ఆయన కు మరొక్కమారు ఘన నివాళి ఘటిస్తున్నాను.. అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
Next Story






