లంచం ఇస్తేనే ఫించన్‌పై మహిళ మరో వీడియో

by Ajay Maddhiboyina |

నంద‌మూరి బాల‌కృష్ణ ఇలాకాలో పింఛ‌న్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అని సచివాల‌య అధికారుల‌ను మ‌హిళ‌ను వేధించిన‌ట్టు ఓ వీడియో వైర‌ల్ అవుతోంది.

లంచం ఇస్తేనే ఫించన్‌పై మహిళ మరో వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: నంద‌మూరి బాల‌కృష్ణ ఇలాకాలో పింఛ‌న్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అని సచివాల‌య అధికారుల‌ను మ‌హిళ‌ను వేధించిన‌ట్టు ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. లంచం ఇవ్వ‌డానికి డ‌బ్బుల కోసం ఓ మ‌హిళ ఏకంగా త‌న చెవి పోగుల‌ను తాక‌ట్టు పెడుతున్న‌ట్టు ఆ వీడియోలో చెబుతోంది. రూ.10 వేలు లంచం ఇస్తే జీవితాంతం నీకు డ‌బ్బు వ‌స్తాయి అంటూ అధికారులు త‌న‌ను లంచం డిమాండ్ చేశార‌ని బాధిరాలు ఆరోపించింది.

అయితే దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఆ మహిళ మాట్లాడిన మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో... వాళ్లే తనను రెచ్చగొట్టి వీడియోలో మాట్లాడేలా చేశారని సదరు మహిళ చెప్పింది. కమ్మలను తన కోడలి ఆస్పత్రి బిల్ కోసం తాకట్టు పెట్టానని చెప్పింది. తనను ఎవరూ లంచం అడగలేదని స్పష్టం చేసింది. దీంతో అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోబడతాయని ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది.

Next Story