BREAKING: బాలకృష్ణకు టికెట్ కన్ఫామ్.. పోటీ చేసే స్థానం ఇదే..!

by Disha Web Desk 19 |
BREAKING: బాలకృష్ణకు టికెట్ కన్ఫామ్.. పోటీ చేసే స్థానం ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫా్మ్ అయ్యింది. టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలోనే బాలకృష్ణకు టికెట్ కేటాయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ మరోసారి ఆయన సిట్టింగ్ స్థానం, టీడీపీ కంచుకోట అయిన హిందుపురం నుండి బరిలోకి దిగనున్నారు. కాగా, టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ విడుదల అయ్యింది. 118 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్, బాబు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 118 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు ఫిక్స్ అయ్యాయి. జనసేనకు మూడు పార్లమెంట్ సీట్లను సైతం ఖరారు చేశారు. టీడీపీలోని కీలక నేతలందరికి ఫస్ట్ లిస్ట్‌లోనే టికెట్లు కన్ఫామ్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుండి, నారా లోకేష్ మంగళగిరి నుండి, అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నారు.

Read More..

ప్రజాశాంతి బెటర్.. జనసేన ఫస్ట్ లిస్ట్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్


Next Story

Most Viewed