బాల సరస్వతి దేవి మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా

by velandi.Saikiran |

ప్రముఖ తెలుగు సినిమా గాయకురాలు, తెలుగు చలనచిత్ర సీమలో తొలి నేపద్య గాయనీమణి, నటి రావు బాలసరస్వతి దేవీ(97) అకాల

బాల సరస్వతి దేవి మరణ వార్తతో  దిగ్భ్రాంతికి గురయ్యా
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రముఖ తెలుగు సినిమా గాయకురాలు, తెలుగు చలనచిత్ర సీమలో తొలి నేపద్య గాయనీమణి, నటి రావు బాలసరస్వతి దేవీ(97) అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, దిగ్భ్రాంతికి గురయ్యానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రావు బాల సరస్వతి దేవి మృతికి బాలకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. బాల సరస్వతి దేవీ చిన్ననాటి నుండే కళారంగంలో ప్రవేశించి 1930ల నుండి 1960ల వరకు తెలుగు, తమిళ సినిమాల్లో గాయనిగా నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

తమిళ సినిమాల్లో భక్త కుచేల, బాలయోగిని,తుకారాం వంటి చిత్రాల్లో చిన్నప్పుడే నటించారు. తెలుగు సినిమాల్లో మొదటి ప్లేబ్యాక్ సింగర్‌గా భాగ్యలక్ష్మి చిత్రంలో "థిన్నే మీద సిన్నోడ" పాటకు స్వరం ఇచ్చి చరిత్ర సృష్టించారు. తెలుగులో షావుకారు, పిచ్చి పుల్లయ్య వంటి ఎన్నో చిత్రాలకు పాటలు పాడి తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఆల్ ఇండియా రేడియోలో మొదటి 'లైట్ మ్యూజిక్' గాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. 2 వేలకు పైగా పాటలు పాడి తెలుగు సినీ చరిత్రలో నిలిచి పోయారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బాలసరస్వతీ దేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story