పార్లమెంట్ ఆవరణలో ఎమ్మెల్యే బాలకృష్ణ.. సైకిల్ తొక్కి సందడి

by Vemula.Srinu Prasad |

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ న్యూఢిల్లీలో సందడి చేశారు...

పార్లమెంట్ ఆవరణలో ఎమ్మెల్యే బాలకృష్ణ..  సైకిల్ తొక్కి సందడి
X

దిశ, వెబ్ డెస్క్: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Hindupur MLA Nandamuri Balakrishna) న్యూఢిల్లీ(New Delhi)లో సందడి చేశారు. ఏపీ నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన నేరుగా పార్లమెంట్ భవన్‌(Parliament House)కు వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులను కలిసేందుకు వెళ్లిన ఆయన తొలుత విజయనగరం ఎంపీ అప్పలనాయుడు(Vizianagaram MP Appalanaidu)ను కలిశారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ పార్లమెంట్‌కు వెళ్లే సైకిల్‌ను బాలయ్యకు అప్పలనాయుడు చూపించారు. దీంతో పార్లమెంట్ ఆవరణలో సైకిల్ ఎక్కి బాలయ్య కొద్దిసేపు సందడి చేశారు.

కాగా ప్రస్తుతం బాలయ్య ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పార్టీ ఎంపీలను కలిశారు. పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla)ను బాలయ్య కలవనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, హరిదీప్ సింగ్ పురీ, మన్ సుఖ్ మండవీయలను బాలకృష్ణ కలవనున్నారు.

Next Story