మా జోలికి వస్తే ఊరుకోను: ఎమ్మెల్యే బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-05 08:57:56  IST  )

టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరించారు..

మా జోలికి వస్తే ఊరుకోను: ఎమ్మెల్యే బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ(TDP) కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ(Mla Balakrishna) హెచ్చరించారు. రాయలసీమ(Rayalaseema) తన అడ్డా అని, హిందూపురం అభివృద్ధికి ప్రతినిత్యం కృషి చేస్తానని ఆయన చెప్పారు.హిందూపురంలోని పేదలకు ఆయన ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నాయకుడని బాలకృష్ణ పేర్కొన్నారు. హిందూపురం అంటే ఎన్టీఆర్ రెండో పుట్టిళ్లని భావించేవారని గుర్తు చేశారు. జవాబుదారి పార్టీగా తెలుగుదేశం పార్టీ పేరుగాంచిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే రూ. 50 కోట్లతో హిందూపురంలో అభివృద్ధి పనులు చేయించినట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో మంచి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసం రూ. 130 కోట్ల నివేదికలు రెడీ చేశామని బాలకృష్ణ స్పష్టం చేశారు.

Next Story