తాడిపత్రిలో హై టెన్షన్.. జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్

by Disha Web Desk 4 |
తాడిపత్రిలో హై టెన్షన్.. జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్
X

.దిశ, వెబ్‌డెస్క్: తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట వంటావార్పునకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరిన ఆయనను పోలీసులు ఇంట్లోకి లాక్కెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. జేసీ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జేసీ నివాసం చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందస్తుగా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

.Also Read..

కాంగ్రెస్‌కు షాకిచ్చేలా శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Next Story