- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవానీపురంలో హైటెన్షన్.. 'హైడ్రా' తరహా కూల్చివేతలు
ఏపీలోని విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేతపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని విజయవాడ భవానీపురంలో భవనాల కూల్చివేతపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు ఎకరాల 40 సెంట్ల వివాదాస్పద స్థలంలో లక్ష్మీ రామ కో ఆపరేటివ్ సోసైటికి అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో అధికారులు ఇళ్లను తొలగిస్తున్నారు. 25 ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను కూల్చి వేయవద్దని ఫ్లాట్ల యజమానులు ఆందోళన చేస్తూ రోడ్ల పై బైఠాయించారు. ఈ క్రమంలోనే భవానీపురం కూల్చివేతలపై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.
విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 31 వరకు కూల్చివేతలపై స్టే విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా.. పోలీసులు పట్టించుకోకుండా కూల్చివేతలు కొనసాగించారని బాధితులు మండిపడుతున్నారు. ఈ తరుణంలో సమస్యను సీఎం చంద్రబాబుకు వివరిస్తామని బాధితులు చెబుతున్నారు. నిన్న భవానీపురంలోని జోజిపేటలో 42 ఇళ్లు కూల్చివేసినట్లు సమాచారం. ఈరోజు బాధితులను స్థానిక ఎస్సై కలవనున్నారు. సమస్యలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని ఎస్సై కోరారు.






