తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

by Vemula.Srinu Prasad |

తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది...

తాడిపత్రిలో మళ్లీ హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: తాడిపత్రి(Tadipatri)లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. కొన్ని నెలలుగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Jc Prabhakar Reddy), మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి(Former Mla Kethi reddy Pedda Reddy) మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈవివాదం ఇప్పుడు మరింత ముదిరింది. దీంతో తాడిపత్రిలో హైటెన్షన్‌ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి నిర్మాణంలో ఆక్రమణలు ఉన్నాయని నోటీసులు జారీ చేశారు. శుక్రవారం పెద్దారెడ్డి ఇంటిని కొలతలు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే పెద్దారెడ్డి ఇంటి వద్ద గతంలోనే మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహించారు. తాజాగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో అధికారులు సర్వే చేసేందుకు నోటీసులు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో వైసీపీ నేతల ఇళ్లు కూల్చివేస్తామని జేసీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేస్తామని మున్సిపల్ అధికారులతో నోటీసులు ఇప్పించారని మండిపడుతున్నారు. దురుద్దేశంతోనే మరోసారి కూడా నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో జేసీ, పెద్దారెడ్డి ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. అతిక్రమిస్తే చర్యలు తప్పవని రెండు పార్టీల నేతలు, కార్యకర్తలకు హెచ్చరించారు.

Next Story