కీసర టోల్ ప్లాజా వద్ద కారుపై సిమెంట్ లారీ బోల్తా.. అడ్వగేట్ శ్రీనివాసరావు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-11 13:09:04  IST  )

కృష్ణా జిల్లా కీసర టోల్ గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బి.శ్రీనివాసరావు స్పాట్‌లోనే మృతి చెందారు..

కీసర టోల్ ప్లాజా వద్ద కారుపై సిమెంట్ లారీ బోల్తా.. అడ్వగేట్ శ్రీనివాసరావు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) కీసర టోల్ గేట్(Keesara Toll Gate) వద్ద జరిగిన ప్రమాదంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బి.శ్రీనివాసరావు(High Court Senior Advocate Srinivasarao) స్పాట్‌లోనే మృతి చెందారు. కారు(Car)పై సిమెంట్ లారీ(Cement Lorry) బోల్తా పడటంతో ఈ ఘోరం జరిగింది. కారు డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసరావు బెల్ట్ సీటు కూడా పెట్టుకున్నారు. ఆయన నడుపుతున్న బీఎమ్‌డబ్ల్యూ కారుపై లారీ ఒక్కసారిగా పడటంతో ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్దకు లారీ అతి వేగంగా రావడంతో పాటు డివెడర్‌ను ఢీకొట్టి శ్రీనివాసరావు నడుపుతున్న కారుపై పడినట్లు పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ అధారంగా బొద్దులూరి శ్రీనివాసరావుదిగా తెలిపారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఆయన భార్య, కుమార్తెతో కలిసి విజయవాడ వెళ్లారు. అయితే ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. హైరిస్క్ చేసి కారుపై పడిన లారీని పక్కకు తీశామని చెప్పారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని కారులో నుంచి తీసి పోస్టుమార్టంకు తరలించామని వెల్లడించారు.

Next Story