ఏపీ లిక్కర్ కేసు: ఏసీబీ కోర్టులో తీర్పు రిజర్వ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-26 12:10:49  IST  )

ఏపీ లిక్కర్ కేసులో కస్టడీ పిటిషన్లపై హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయింది..

ఏపీ లిక్కర్ కేసు: ఏసీబీ కోర్టులో తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర లిక్కర్ స్కాం కేసు(Liquor scam case)లో నిందితులు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(YSRCP leader Chevireddy Bhaskar Reddy), వెంకటేశ్ నాయుడు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరింతగా లోతైన విచారణ కోసం ఇద్దరినీ ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారుల విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఈ రోజు విచారించింది. న్యాయమూర్తి ఎదుటు ఇరువర్గాల వాదనలను వినిపించారు. దీంతో ఈ నెల 30న ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది. అప్పటి వరకూ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు చెవిరెడ్డి, వెంకటేశ్‌కు బెయిల్ ఇవ్వాలని లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితుడు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో 34వ నిందితుడు వెంకటేశ్ కాగా చెవిరెడ్డి ఏ-38గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఓటర్లకు నగదును పంపిణీ చేసేందుకు మద్యం స్కాం డబ్బులను వినియోగించారని ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు.

Next Story