వారికి రూ.30 లక్షలు ఇవ్వాల్సిందే.. హైకోర్టు ఉత్తర్వులు

by Jakkula.Mamatha |

ఏపీ హైకోర్టు(AP High Court) కీలక నిర్ణయం తీసుకుంది.

వారికి రూ.30 లక్షలు ఇవ్వాల్సిందే.. హైకోర్టు ఉత్తర్వులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు(AP High Court) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం(Andhra Pradesh)లో పారిశుధ్య కార్మికులు మురుగు డ్రెయిన్లు క్లీన్ చేస్తూ మరణిస్తే ఆ కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల మాణిక్యాలరావు అనే కార్మికుడు మ్యాన్‌హోల్ క్లీన్ చేస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పారిశుద్ధ్య కార్మికుడు మాణిక్యాలరావు మరణించగా ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక ఉత్తర్వులిచ్చారు. ఈ క్రమంలో మాణిక్యాలరావు కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని(AP Government) ఆదేశించింది. అలాగే, మృతుడి భార్యకు ఉద్యోగం కూడా ఇవ్వాలని, పిల్లలకు విద్య, నైపుణ్య శిక్షణను కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చారు. కాబట్టి మిగిలిన రూ.20 లక్షలను నెల రోజుల్లో వారికి అందజేయాలని తెలిపారు. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

Next Story