ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించండి: హైకోర్టు

by Ajay Maddhiboyina |

టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌శాంతి రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా అనేక షెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేశారు.

ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించండి: హైకోర్టు
X

దిశ‌, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌శాంతి రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా అనేక షెక్ష‌న్ ల కింద కేసులు న‌మోదు చేశారు. ఆయ‌న‌ను మంగ‌ళ‌వారం కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది కోరారు. దీంతో విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిదా వేసింది. నేడు విచార‌ణ జ‌ర‌ప‌గా కోర్టులో ప్ర‌స‌న్న‌కుమార్ కు చుక్కెదురైంది.

బెయిల్ నిరాక‌రిస్తూ బీఎన్ఎస్ 35(3) సెక్ష‌న్ ప్ర‌కారం నోటీసులు ఇచ్చి విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆదేశించింది. అంతే కాకుండా మ‌హిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తారా అంటూ మాజీ ఎమ్మెల్యేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి అనుచిత వ్యాఖ్య‌లు ఎలా చేస్తారు.. అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా నియంత్రించుకోండి అంటూ సూచించింది. మ‌హిళా ఎమ్మెల్యేను ఇలానేనా గౌర‌వించేది అంటూ ప్ర‌శ్నించింది. మాట్లాడేప్పుడు జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌ని హెచ్చ‌రించింది.

Next Story