- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు.. కారణం ఇదే..?
ఎంపీ మిథన్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ..

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ మిథన్ రెడ్డి(MP Mithan Reddy)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు(Liquor Case)లో ఆయన బెయిల్‌పై విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఆయనకు మంజూరైన బెయిల్‌పై తాజాగా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు చూపిన కారణాలు సహేతుకంగా లేవని హైకోర్టు(High Court)లో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. తొలిసారి బెయిల్ డిస్మిస్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు లేకపోయినా రెండోసారి బెయిల్ మంజూరు చేశారని పిటిషన్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపీ మిథున్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9కి విచారణను వాయిదా వేసింది.
కాగా లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4 నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 71 రోజులు పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్‌లో జుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సుదీర్ఘ వాదనల తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మిథున్‌రెడ్డి గత నెల 29న జైలు నుంచి విడుదల అయ్యారు.






