పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ కొట్టివేత.. కింది కోర్టుకు వెళ్లేందుకు వెసులుబాటు

by Vemula.Srinu Prasad |

పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది..

పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్ కొట్టివేత.. కింది కోర్టుకు వెళ్లేందుకు వెసులుబాటు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ కేసు(APPSC case)లో పీఎస్‌ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) రిమాండ్ ఖైదీగా జైలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పీఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మరో నిందితుడు మధు సైతం హైకోర్టు(High Court)లో పిటిషన్లు దాఖలు చేశారు.

అయితే సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ పిటిషన్లను కొట్టివేసింది. అయితే కొంచెం ఊరట కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ కోసం కిందికోర్టుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే వీళ్ల పిటిషన్లపై రెండు వారాల్లో విచారణ చేపట్టి పరిష్కరించాలని దిగువ కోర్టును ఆదేశించింది. ఈ మేరకు దిగువ కోర్టుకు వెళ్లేందుకు పీఎస్ఆర్ ఆంజనేయులు, మధు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Next Story