- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోగి రమేశ్ కుమారుడి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన హైకోర్టు ఈ ఘటనపై పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) కుమారుడు జోగి రోహిత్ (Jogi Rohith) దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (Lunch Motion Petition) విచారణకు స్వీకరిస్తూ ఏపీ హైకోర్టు (AP High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తమ నివాసంపై జరిగిన దాడి, ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలను తీవ్రంగా పరిగణిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రోహిత్ తన పిటిషన్‌లో కోరారు. తన తండ్రి జోగి రమేష్‌పై రాజకీయ కక్షతో కొందరు వ్యక్తులు అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడి సమయంలో ప్రాణహాని తలెత్తే ప్రమాదం ఏర్పడిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తమ ఇంటికి నిప్పు పెట్టి ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో తమ కుటుంబానికి ఎటువంటి ముప్పు కలగకుండా పటిష్టమైన పోలీస్ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ప్రాణాలకు రక్షణ లేదని రోహిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన హైకోర్టు ఈ ఘటనపై పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.






