- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోడి గ్రామంలో హీరో శ్రీవిష్ణు సందడి
సొంత గ్రామంలో హీరో శ్రీవిష్ణు సందడి చేశారు...

దిశ, అల్లవరం: ప్రముఖ సినిమా హీరో శ్రీవిష్ణు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామంలో శనివారం సందడి చేశారు. గోడి గ్రామానికి చెందిన రుద్రరాజు కృష్ణంరాజు, రేణుక దంపతుల కుమారుడు అయిన శ్రీవిష్ణు తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాల్లో హీరో పాత్రలు పోషించారు. శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారెవరురా.., సామజవరగమన, ఓం భీం భుష్.. చిత్రాలు ప్రేక్షకాదరణ పొంది మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.. స్వగ్రామం విచ్చేసిన శ్రీవిష్ణుకు కుటుంబికులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హీరో శ్రీవిష్ణును రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. గోడి గ్రామానికి చెందిన యువకునిగా శ్రీవిష్ణు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుని, ఎటువంటి సినిమా నేపథ్యం లేకపోయినా హీరోగా ఎదిగిన శ్రీవిష్ణుకు అభినందనలు తెలిపారు. బంధువుల ఇంట్లో జరగనున్న శుభకార్యక్రమానికి హాజరైన శ్రీవిష్ణు ముమ్మిడివరం నియోజకవర్గంలోకూడా సందడి చేశారు.






