తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో సంతోష్ శోభన్

by Naga Rani Yarlagadda |

టాలీవుడ్ ప్రముఖ యువ హీరో సంతోష్ శోభన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరో సంతోష్ శోభన్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ యువ హీరో సంతోష్ శోభన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు సంతోష్ శోభన్ కు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సంతోష్ తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇచ్చి, నవ్వుతూ పలకరించారు సంతోష్.

2011లో గోల్కొండ హైస్కూల్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి నటుడిగా వచ్చిన సంతోష్ శోభన్.. ఆ తర్వాత పేపర్‌బాయ్‌గా వచ్చి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి, అన్నీ మంచి శకునములే వంటి డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ కూడా మ్యాడ్ సినిమాతో హీరోగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

Next Story