- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబును కలిసిన హీరో నాగార్జున.. కారణం ఇదే!
ఏపీ సీఎం చంద్రబాబును టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు(మంగళవారం) కలిశారు. అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబును టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు(మంగళవారం) కలిశారు. అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ క్రమంలో వివాహ పత్రిక అందజేశారు.
అనంతరం సరదాగా కాసేపు ముచ్చటించారు. అయితే గతేడాది నవంబర్‌లో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌కు జైనబ్ రవ్జీతో ఎంగెజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ నెల(జూన్) 6వ తేదీన అక్కినేని అఖీల్, జైనబ్ రవ్జీ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. అయితే.. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. ఈ క్రమంలో వీరి పెళ్లి కూడా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టేడియోలోనే జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.






