‘భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా’.. హీరో మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-15 14:42:01  IST  )

హీరో మంచు విష్ణు(Hero Manchu Vishnu) ఇవాళ(శనివారం) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని ఊటుకూరు భక్త కన్నప్ప గుడిని సందర్శించారు.

‘భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా’.. హీరో మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: హీరో మంచు విష్ణు(Hero Manchu Vishnu) ఇవాళ(శనివారం) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని ఊటుకూరు భక్త కన్నప్ప గుడిని సందర్శించారు. కన్నప్ప చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ఈ మూవీలో కథానాయికగా ప్రీతి ముకుందన్, కన్నప్ప పాత్రలో మంచు విష్ణు, రుద్రుడిగా ప్రభాస్(Prabhas), మహా శివుడిగా అక్షయ్ కుమార్ , పార్వతిగా కాజల్ అగర్వాల్(Kajal agarwal) కనిపించనున్నారు. మోహన్ బాబు(Mohan Babu), మోహన్ లాల్(Mohanlal) కీలక పాత్రలు పోషించారు. ఆలయ దర్శనానంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్తకన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే కన్నప్ప సినిమా తీశామన్నారు. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోందని చెప్పారు. ఈ క్రమంలో ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

READ MORE ...

ఆ విషయం గురించి మాట్లాడితే ప్రభాస్ చంపేస్తా అని అన్నాడు.. మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్


Next Story