నేలపట్టులో హీరో మంచు విష్ణు సందడి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-11 14:58:17  IST  )

ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలో హీరో మంచు విష్ణు సందడి చేశారు..

నేలపట్టులో హీరో మంచు విష్ణు సందడి
X

దిశ, సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్బంగా నేలపట్టు పక్షుల కేంద్రంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వేలాది మంది పర్యాటకులు విడిది చేసిన విదేశీ పక్షులను సందర్శించారు. పర్యాటక కేంద్రానికి ప్రముఖ తెలుగు యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఆయన సందర్శించారు. చెరువు కట్టపైనుండి పక్షులను వీక్షించి సంతోషం వక్తం చేసారు. ఎక్కడో విదే శాలనుంచి మన ప్రాంతానికి వచ్చి నేలపట్టులో ఆవాసం ఏర్పాటుచేసుకొని మనకు ఆనందంతోపాటు, అహ్లాదాని ఇవ్వడం ప్రకృతిలో ఇదో వింతేనని అన్నారు. అదేవిదంగా ఉప్పునీటి సరస్సులో అందమైన ఫ్లెమింగోలు రావడం వాటికీ పండుగచేయడం ఆనందదాయకమే నని తన అభిప్రాయం వెల్లడించారు. మన తిరుపతి జిల్లాలో పక్షుల పండుగ చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఆయనతో సెల్ఫీలకోసం పోటీ పడి ఫోటోలు తీసుకున్నారు.

Next Story