- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదిగో నా చెవిదిద్దులు.. వీటిని తీసుకొని నాకు న్యాయం చేయండి
ఇదిగో నా చెవిదిద్దులు.. వీటిని తీసుకొని నాకు న్యాయం చేయండి అంటూ ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇదిగో నా చెవిదిద్దులు.. వీటిని తీసుకొని నాకు న్యాయం చేయండి అంటూ ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన ఈరోజు కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మీకోసం కార్యక్రమానికి తలకటూరు అనే గ్రామం నుంచి భువనేశ్వరి అనే యువతి వచ్చింది. అధికారుల వద్ద తన అర్జీతోపాటు చెవిదిద్దులను కూడా తీసి ఉంచింది. తనకు న్యాయం చేయాలని కో రింది. దీంతో అక్కడ ఉన్న అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. అలా చేయడం సరికాదు వాదించారు. అనంతరం ఆ యువతి విలేకరులతో మాట్లాడుతూ.. కోర్టులో విచారణ ఉండగానే తమకు సంబంధించిన స్థలంలో కొందరు ఇల్లు కట్టా రని తెలిపారు. అడిగితే ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ఉన్న స్థానిక రాజకీయ నాయకులు ఎవరికి డబ్బు ఉంటే వారి వైపు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారుల వద్దకు తనకు న్యాయం చేయాలంటూ చాలాసార్లు వచ్చానని తెలిపారు. తన వద్ద డబ్బులు లేవని అన్నారు. కాబట్టి నా చెవి దిద్దులు అధికారులకు ఇవ్వటానికి ప్రయత్నించాలని ఆమె తెలిపారు. తాను అనాధనని తాతయ్య తప్ప ఎవరూ లేరని కన్నీటి పర్యంతం అయింది






