- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె మృతి సినీ రంగానికి తీరని లోటు.. ఏపీ మంత్రి సంతాపం
తెలుగు చలనచిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి(101) కన్నుమూశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్(Filmnagar) నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆమె.. సతీ అనసూయ అనే సినిమాతో 1936లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాతగా కొన్ని సినిమాలకు తెరకెక్కించారు. తాజాగా.. ఆమె మరణం పట్ల ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ.. అనేక భాషల్లో నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని మంత్రి అభివర్ణించారు. తెలుగు జాతి గర్వించదగ్గ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు, సంగీత దర్శకులు ఘంటసాల సహా ఎంతోమంది దిగ్గజాలను సినీ రంగానికి పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిదని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు.
తన సినిమాల ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తూ.. పదుల సంఖ్యలో గొప్ప చిత్రాలు తీసి నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అన్నారు. తెలుగు కళా రంగానికి కృష్ణవేణి అందించిన సేవలు అమోఘమని తెలుపుతూ ఆమె మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు మంత్రి దుర్గేష్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.






