- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతున్న ఆవర్తనం.. నేడు, రేపు ఈ జిల్లాలకు భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం (Bay of Bengal) దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం (Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో పశ్చిమమధ్య బంగాళాఖాతం (Bay of Bengal) దానిని ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం (Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
నేడు.. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి ,విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, కృష్ణా, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.






