- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. నిండిన కంపార్టుమెంట్లు
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకుని దర్శనం చేసుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో స్వామివారికి మొక్కులు తీర్చుకుని దర్శనం చేసుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. శుక్రవారం ఉదయానికి 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరిలో టోకెన్లు లేనివారం సర్వదర్శనానికి 12 గంటలు పడుతుందని, టోకెన్లు ఉన్న భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. రూ.300 శ్రీఘ్రదర్శనం భక్తులకు 3-5 గంటల్లో శ్రీవారి దర్శనం జరుగుతుందని పేర్కొంది. నిన్న (గురువారం) స్వామివారిని 64,571 మంది భక్తులు దర్శించుకోగా.. 23,634 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా.. వీకెండ్ తో పాటు సోమవారం (జనవరి 26) పబ్లిక్ హాలిడే కావడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది.






