రాష్ట్రానికి బిగ్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-03 12:54:30  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షం బీభత్సం సృష్టించింది..

రాష్ట్రానికి బిగ్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పలుచోట్ల భారీ వర్షం(Heavy Rain) బీభత్సం సృష్టించింది. రానున్న మూడు రోజుల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన ఏకధాటిగా దంచి‌కొట్టింది. దీంతో పలుచోట్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఈ మేరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదిలా ఉండగా మరో రెండు కూడా వర్షాలు పడే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ మరోసారి సైతం ప్రజలను అప్రమత్తం చేసింది. రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలో పిడుగులు(Thunderbolts) పడే అవకాశం ఉందని హెచ్చరించారు. నంద్యాల(Nandyala), కర్నూలు(Kurnool), అన్నమయ్య(Annamayya) జిల్లాలో పిడుగులు ఉధృతంగా పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. పిడుగులు పడే సమయంలో రైతులు పొలాల్లో ఉండొద్దని, అలా అని చెట్ల కిందకు కూడా వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడుతున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Next Story