Breaking: గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షం

by Vemula.Srinu Prasad |

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది..

Breaking: గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో (Guntur, Prakasm District) భారీ వర్షం కురిసింది. ఈ ఉదయం వర్షం ఒక్కసారిగా ఈదురుగాలులతో కుమ్మేసింది. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో ఈదురుగాలులో కురిసిన వర్షంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. బాపట్ల జిల్లా వేటపాలెం, చీరాల, చినగంజాం, అద్దంకి చెరుకుపల్లిలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. చీరాలలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు పరిధిలో ఐదు మండలాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. కొన్ని కాలనీలను జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది.. ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story