గుంటూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం.. రోడ్లు జలమయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-17 10:26:52  IST  )

గుంటూరు జిల్లాలో పలుచోట్ల భారీగా వర్షం కురిసింది.....

గుంటూరు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం.. రోడ్లు జలమయం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా (Guntur District)లో పలుచోట్ల భారీ వర్షం(Heavy Rain) కురిసింది. ఉదయం నుంచి చల్లగా ఉన్న వాతావరణం.. మధ్యాహ్నానికికల్లా మబ్బులు నల్లగా మారాయి. అనంతరం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. పొన్నూరులోనూ భారీగా వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. ఆయా కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు అధికారులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సహాయ చర్యలు అందిస్తున్నారు. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు మాత్రం చెరువులను తలపిస్తున్నాయి.

Next Story