ఆ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. కలెక్టరేట్లలో కంట్రోల్ రూంల ఏర్పాటు

by Kema Shiva Kumar |

బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

ఆ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. కలెక్టరేట్లలో కంట్రోల్ రూంల ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోనసీమ, ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఉమ్మడి గుంటూరు, బాపట్ల జిల్లాలో అధికరులు అప్రమత్తమయ్యారు. గుంటూరు (Guntur), బాపట్ల (Bapatla) కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటమురళి ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసుకుని అందరూ తప్పనిసరిగా విధుల్లో ఉండాలి ఆదేశాలు జారీ చేశారు.

కృష్ణా నది పరివాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించ వద్దని ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి నిషేధమని తెలిపారు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఒకటో నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరుకు భారీగా ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుంది. ప్రస్తుతం అంది 2,070 క్యూసెక్కులుగా ఉంది. అయితే, డైవర్షన్‌ ఛానెల్‌ తెరవకపోవడంతో బుడమేరు పరివాహక ప్రాంతాలకు భారీ ముప్పు తప్పింది.

Next Story