Rain Alert: నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు!

by Jakkula.Mamatha |

ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Rain Alert: నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈక్రమంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story