Srisailam Project: అధికారుల కీలక నిర్ణయం.. 8 గేట్లు ఎత్తివేత

by Vemula.Srinu Prasad |

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షానికి తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.....

Srisailam Project: అధికారుల కీలక నిర్ణయం.. 8 గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షానికి తెలుగు రాష్ట్రాల(Telugu States) ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఏపీ(Ap), తెలంగాణ(Telangana)లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం ఒక్కసారిగా వరద ప్రవాహం(flood flow) పెరిగింది. ఈమేరకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు 2,16,520 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3.40 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,624 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగుల వరకు నీరు ఉంది. ఇక ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203 టీఎంసీలుగా ఉంది.

Next Story