Heavy Rain Alert:తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు బయటకు రావొద్దు!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-10 10:39:26  IST  )

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rain Alert:తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు బయటకు రావొద్దు!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత రెండు మూడు రోజులుగా ఎండలు(temperatures) దంచికొట్టగా.. వాతావరణం(weather)లో ఒక్కసారిగా భిన్నమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ(మంగళవారం) ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, హైదరాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయం, తూర్పు దిశల నుంచి తెలంగాణ వైపునకు ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండరాదని తెలిపారు. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story