ఎన్టీఆర్ జిల్లాలో వర్ష బీభత్సం.. పలు ప్రాంతాలు జలమయం

by Ajay Maddhiboyina |

తెలుగు రాష్ట్రాల‌లో ఓ వైపు ఎండ‌లు మండిపోతుంటే మ‌రోవైపు వ‌ర్షాలు సైతం దంచికొడుతున్నాయి. ఏ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డుతుందో.. ఏ స‌మ‌యంలో ఎండ కొడుతుందో తెలియ‌క ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో వర్ష బీభత్సం.. పలు ప్రాంతాలు జలమయం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల‌లో ఓ వైపు ఎండ‌లు మండిపోతుంటే మ‌రోవైపు వ‌ర్షాలు సైతం దంచికొడుతున్నాయి. ఏ స‌మ‌యంలో వ‌ర్షం ప‌డుతుందో.. ఏ స‌మ‌యంలో ఎండ కొడుతుందో తెలియ‌క ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మంగ‌ళ‌వారం ఎన్టీఆర్ జిల్లాలో వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టించాయి. తిరువూరు, విస్స‌న్న‌పేట‌లో ఈదురు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాల్లోకి భారీగా వ‌ర్ష‌పునీరు చేరింది. ప‌లుచోట్ల చెట్లు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు సైతం నేల‌మ‌ట్టం అయ్యాయి. తిరువూరు బ‌స్టాండ్ లో వ‌ర‌ద‌నీరు భారీగా నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎండలు మెల్లిమెల్లిగా తగ్గుముకం పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వగా వాతావరణం కాస్త చల్లబడుతోంది. బంగాళాకాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా చల్లగాలులు వీయడంతో ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. గత వారం రోజుల నుండి రాష్ట్రంలో అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

Next Story