- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో భారీ వర్షాలు..కలెక్టర్లకు హోంమంత్రి కీలక ఆదేశాలు
ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్లలో వర్షంతో పాటూ ఉరుములు, బలంగా గాలులు వీచాయి. చీరాల, కారంచేడుతో పాటూ పలు మండల్లాలో వర్షం దంచికొట్టింది. చినగంజాం, పాతచీరాలలో పిడుగులు పడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్లలో వర్షంతో పాటూ ఉరుములు, బలంగా గాలులు వీచాయి. చీరాల, కారంచేడుతో పాటూ పలు మండల్లాలో వర్షం దంచికొట్టింది. చినగంజాం, పాతచీరాలలో పిడుగులు పడ్డాయి. పిడుగు పడటంతో గేదలు మేపుతున్న గడ్డం బ్రహ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే కన్నుమూశాడు. మరోవైపు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ కోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.
రెండు రోజుల పాటూ రాష్ట్రంలో పిడుగులతో పాటూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. హోంమంత్రి అనిత విపత్తు నిర్వహణ సంస్థ ఎండీతో ఫోన్ లో మాట్లాడారు. పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆమె కలెక్టర్ లతో ఫోన్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, విద్యుత్ సరఫరా, నీటిసరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.






