- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ జిల్లాలకు మూడ్రోజులు భారీ వర్షసూచన.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో(APSDMA) రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఏప విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో(APSDMA) రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఏప విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపారు.
కాగా.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 65,865 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 66,052 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.30 అడుగులుగా ఉంది.






