బిగ్ అల‌ర్ట్‌..ఈ నెల 24 నుంచి మ‌ళ్లీ భారీ వర్షాలు

by velandi.Saikiran |   (  Updated:2025-11-15 01:20:42  IST  )

ఏపీలో మళ్లీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 24వ తేదీ నుంచి దాదాపు మూడు రోజుల పాటు అంటే 27వ తేదీ

బిగ్ అల‌ర్ట్‌..ఈ నెల 24 నుంచి మ‌ళ్లీ భారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో మళ్లీ వర్షాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 19వ తేదీ నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 21వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది.

దీని ఎఫెక్ట్ కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 24వ తేదీ నుంచి దాదాపు మూడు రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయట. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా జిల్లాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇలాంటి నేపథ్యంలో రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని ఈ సూచనలు కూడా చేసింది. అయితే ఈ అల్పపీడనం ఎఫెక్ట్ తెలంగాణలో ఉండబోదని తెలుస్తోంది.

Next Story