పాలకొండలో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులతో బీభత్సం

by Vemula.Srinu Prasad |

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన అకాల వర్షం ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది....

పాలకొండలో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులతో బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District) పాలకొండ నియోజకవర్గం(Palakonda Constituency)లో భారీ వర్షం(Heavy Rain) కురుస్తోంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన అకాల వర్షం ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాకుండా, సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిడుగుల ధాటికి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా మన్యం ప్రాంత రైతులకు తీరని వేదనను మిగిల్చింది. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉన్న మామిడి, జీడి పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల ధాటికి మామిడి కాయలు నేలరాలాయి. వర్షం కారణంగా జీడి పిందెలు దెబ్బతిన్నాయి. ఏడాది కాలం పాటు కష్టపడి సాగు చేసిన పంట కళ్ళ ముందే నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Next Story