- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొంథా ఎఫెక్ట్.. విజయవాడకు భారీ వర్ష సూచన
‘మొంథా’ తుపాను నేపథ్యంలో మంగళవారం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుపాను నేపథ్యంలో మంగళవారం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 16 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ హెచ్చరికలతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు అప్రమత్తమై, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. దుకాణాలు, అన్ని వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేసారు. అయితే మెడికల్ షాపులు, కూరగాయలు, పాల విక్రయ కేంద్రాలు తెరిచేందుకు మాత్రం అనుమతించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో 9154970454, వీఎంసీ కార్యాలయంలో 08662424172, 08662422515, 08662427485 నెంబర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఈ నెంబర్లకు ఫోన్ చేసి సాయం పొందవచ్చని తెలిపారు. నదీపరీవాహక, ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు. వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లలో 34 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, అక్కడికి తరలివచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
READ MORE ...






