- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
APSDMA:ఏపీలో భిన్న వాతావరణం.. ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజులు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని APSDMA డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ క్రమంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు.
ఈ క్రమంలో బుధ, గురువారం ప్రకాశం, కడప, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్య సాయి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా.. రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలు అధిక ఎండల తీవ్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాతావరణంలో వస్తున్న భిన్నమైన మార్పుల దృష్ట్యా రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.






