రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

by velandi.Saikiran |

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్..ప‌లు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు ప‌డే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాగల 4-5 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్ల‌డించారు. గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు ఇవాళ‌ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చని వివ‌రించారు. ఈ క్ర‌మంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద‌ నిలబడకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచ‌న‌లు చేశారు.

ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇది ఇలాఉండ‌గా, ఏపీలో హీట్‌వేవ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వడగాల్పుల నుంచి రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టెంట్లు, చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ అందించాలన్న సీఎం చంద్రబాబు...తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని సూచనలు చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Next Story