బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

by Naga Rani Yarlagadda |

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతాలంలో ఉపరితల ఆవర్తనం (Surface periodicity) ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో మన్యం, అల్లూరి , విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు (Moderate to Heavy Rains) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈదురుగాలులతో పాటు పిడుగులు (Thunder Storms) పడే ఛాన్స్ ఉండటంతో.. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉపరితల ఆవర్తన ప్రభావం తెలంగాణ జిల్లాలపై కూడా ఉన్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల,జనగామ, భూపాలపల్లి, కొమురంభీం, కరీంనగర్‌, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్ నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది.

Next Story