శ్రీశైలానికి భారీగా వరద నీరు.. అధికారుల కీలక నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-13 15:00:21  IST  )

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది....

శ్రీశైలానికి భారీగా వరద నీరు.. అధికారుల కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project)కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. కుడి, ఎడమ వైపు కూడా వాటర్ ఏ మాత్రం తగ్గడం లేదు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు అంతకంతకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడు గేట్లు ఎత్తి 1,89,133 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,89, 651 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2,89,784 క్యూసెక్కులు అని తెలిపారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా తాజాగా 882.5 అడుగులకు చేరిందని చెప్పారు. నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.05లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

Next Story