Dhavaleswaram : ధవళేశ్వరానికి భారీగా వరద.. 175 గేట్లు ఎత్తివేత

by Muthe.Rajitha |   (  Updated:2025-07-27 12:18:36  IST  )

తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ దగ్గర గోదావరి నదిలో వరద ఉధృతి భారీగా పెరిగింది.

Dhavaleswaram : ధవళేశ్వరానికి భారీగా వరద.. 175 గేట్లు ఎత్తివేత
X

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ దగ్గర గోదావరి నదిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. ఎగువ ప్రాంతాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలో భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజీలోని 175 గేట్లను ఎత్తి 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని బంగాళాఖాతంలోకి విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకారం, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 35.6 అడుగులు ఉండగా.. కూనవరం వద్ద 14.9 మీటర్లు, పోలవరం వద్ద 10.23 మీటర్లుగా నమోదైంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమై, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. అలాగే గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాల్లో రెస్క్యూ బోట్లు, రిలీఫ్ సామాగ్రిని సిద్ధం చేశారు.

Next Story