కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా నీటి విడుదల

by Naga Rani Yarlagadda |

తెలంగాణలోని జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు విడుదలవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.

కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా నీటి విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు విడుదలవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో.. అధికారుకు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 4,04,658 క్యూసెక్కులు ఉండగా.. ప్రస్తుతం 3,81,392 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,237 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. కాగా.. అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కురుస్తోన్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నలు పంటలు వేయగా.. పంటంతా వరద నీటిలో మునిగిపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story