- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో క్లౌడ్ బరస్ట్ తరహా వర్షం..25 నిమిషాల్లోనే 5 సెం.మీ. వర్షపాతం
by Vemula.Srinu Prasad |
గుంటూరులో క్లౌడ్ బరస్ట్ తరహా భారీ వర్షం కురిసింది..

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో క్లౌడ్ బరస్ట్(Cloud burst) తరహా భారీ వర్షం కురిసింది. కేవలం 25 నిమిషాల్లోనే 5 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. మరోవైపు అమరావతి, సత్తెనపల్లి విజయవాడలో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. స్థానిక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయి.
అయితే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మెరకవైపు రావాలని సూచించారు. వర్షాలు తగ్గేవరకు చెరువులు, నదులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Next Story






