- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో హఠాన్మరణం
ఇటీవల గుండెపోటు మరణాలు భారీగా పెరిగాయి. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల గుండెపోటు మరణాలు భారీగా పెరిగాయి. ఆడుకుంటూనో.. పరిగెత్తుతూనో, మాట్లాడుతూనో, నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొందరైతే ఉన్నట్టుంది కుప్పకూలిపోతున్నారు. యువకులు, పెద్దలు, చిన్నలు అనే తేడా లేకుండానే ఇలాంటి హఠాన్మరణాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చనే భయాన్ని ఈ ఘటనలు కలుగజేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం షటిల్ ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయారు. గుండెపోటుతో క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.. తాజాగా తిరుపతిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వైద్యుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. తిరుపతి స్విమ్స్‌కు తరలించేలోపే వైద్యుడు చనిపోయారు. ఈ ఘటనతో తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది.
Next Story






