- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై విచారణ
ఏపీ మద్యం స్కాం (Liquor Scam) కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ (Bail Petition) పై నేడు విచారణ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మద్యం స్కాం (Liquor Scam) కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ (Bail Petition) పై నేడు విచారణ జరగనుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు (ACB Court) నేటికి వాయిదా వేసింది. మద్యం కేసులో నిందితులైన చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదే కేసులో నిందితుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి గత సెప్టెంబరులో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ షరతులను సడలించాలని కోరుతూ మిథున్ రెడ్డి మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశఆల్లో పాల్గొనేందుకు బెయిల్ షరతులను సడలించాలని ఎంపీ ఏసీబీ కోర్టును కోరారు. ప్రొసిక్యూషన్ తరపున సమయం కోరడంతో విచారణ నేటికి వాయిదా వేసింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసే సమయంలో అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని పరిమితి విధించిన విషయం విదితమే.






