- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌పై హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా
పవన్ కల్యాణ్‌పై దాఖలు అయిన పిటిషన్‌పై విచారణ 15కు వాయిదా పడింది...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం(Deputy CM)గా పవన్ కల్యాణ్(Pawan Kalyan) అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
కాగా పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనడంపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్(Former IAS officer Vijay Kumar) అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రిగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నారని తెలిపారు. ఈ పిటిషపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.






