- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొబైల్ కోర్టుకు వెళ్లండి: అనంతబాబు కస్టడీపై పోలీసులకు ధర్మాసనం సూచన
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని రాజమండ్రి ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ...

దిశ, వెబ్ డెస్క్: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు(Driver Subramaniam murder case)లో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు(MLC Ananthababu's bail cancelled) చేయాలని రాజమండ్రి ప్రత్యేక కోర్టు(Rajahmundry Special Court)లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం మే 6కు విచారణ వాయిదా వేసింది. అయితే అప్పటివరకూ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులకు రాజమండ్రి మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ఇక సాక్షులను బెదిరించిన కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని అనంతబాబు తరుపున దాఖలు అయిన పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ వాయిదా పడటంతో అనంతబాబును మళ్లీ జైలుకు తరలించారు. అయితే అనంతబాబు కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్‌ను పోలీసులు గురువారం రాజమండ్రి మొబైల్ కోర్టులో దాఖలు చేయనున్నారు. దీంతో ఈ కేసుపై ఉత్కంఠ నెలకొంది.






