- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఏపీలో లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ మరికొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ మరికొందరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) విచారణ జరిగింది. జస్టిస్ పార్థివాల, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా దర్యాప్తుకు హాజరయ్యామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి, నిరంజన్ రెడ్డిలు తెలిపారు. ఈ క్రమంలో ఏపీ సీఐడీ దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించేందుకు సమయం కావాలని ఆయన తరపు లాయర్లు కోరారు. దీంతో తదుపరి విచారణను న్యాయమూర్తి 2 వారాలకు వాయిదా వేశారు. అప్పటి వరకు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
Next Story






